పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభ మయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్య మవుతూ వస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టాయి. దీంతో గట్లర్లు ఒకవైపు వంగినట్లు తెలు స్తోంది. చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో బ్యాలెన్స్ తప్పి కూలినట్లు సమాచారం.
పెద్దపల్లి జిల్లాలో కూలిన మానేరు వంతెన
0
244
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


