తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తుండడంతో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు, రేపు అయితే ఎండలు మరింత మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావర ణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వీసులు తగ్గించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో సర్వీసులను కుదిస్తున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపటి నుంచి బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
0
197
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


