‘దర్శిని’ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్

వీ4 సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ ఎల్వీ సూర్యం నిర్మాతగా, డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్శిని’. వికాస్‌, శాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏపీ పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌‌ను కలిసి పాటలు, టీజర్‌ను చూపించింది. టీజర్, సాంగ్స్ చూసిన మంత్రి అమర్నాథ్.. చిత్రబృందానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. ‘ఈ సినిమాలోని పాటలు, టీజర్‌ చూశాను. చాలా బాగున్నాయి. సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’ అని చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందించాం. ముఖ్యంగా థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం బాగా అలరిస్తుంది. మా సినిమా పోస్టర్‌ను లాంచ్ చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు’’ అని అన్నారు.

హీరో వికాస్ మాట్లాడుతూ.. ‘‘కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. మా సినిమా పోస్టర్ లుక్ నుంచి సాంగ్స్, టీజర్ వరకు ప్రేక్షకులు నచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మంత్రి గారు బిజీ టైమ్‌లో కూడా మాకు టైమ్ కేటాయించి సపోర్ట్ చేశారు. ఇది మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అని అన్నారు.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్