25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

తాజా మేనిఫెస్టోతో బీజేపీకి ఓట్లు పడేనా ?

      లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా చేసుకుని బీజేపీ సంకల్పపత్రను రూపొందించినట్లు స్పష్టమవు తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక కీలకాంశాలు ఇప్పటికే బీజేపీ అమ్ములపొదిలో అస్త్రాలుగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా అన్నదాతలు కొంతకాలంగా బీజేపీపై గరంగరంగా ఉన్నారు. నరేంద్ర మోడీ సర్కార్ వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కార్పొరేట్ రంగానికి అధిక ప్రయోజనాలు చేకూర్చడమే పనిగా పెట్టుకుందన్న విమర్శలు కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు మూడేళ్ల కిందట మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఢిల్లీ శివార్లలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.రైతుల మహోద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నరేంద్ర మోడీ సర్కార్ ప్రయత్నించింది. అయితే నిర్బంధాలు, అణచివేతను తట్టుకుని అన్నదాతలు నిలబడ్డారు. దీంతో చివరిక్షణంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే అప్పట్లో రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తి వేస్తామని మోడీ సర్కార్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు హామీ అమలు కాలేదు. ఇదిలా ఉంటే పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఇటీవల రైతులు మరోసారి ఢిల్లీలో ఉద్యమించారు. ఈ ఉద్యమం కూడా చల్లారేదాకా ఊరుకోలేదు కేంద్ర ప్రభుత్వం.

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడానికి ముందు రైల్వేలో సీనియర్ సిటిజన్లకు అనేక రాయితీలు ఉండేవి. అయితే ఈ రాయితీలకు మోడీ సర్కార్ ఎండ్‌కార్డ్‌ వేసింది. రాయితీలు పునరుద్దరించాల్సింది గా సీనియర్ సిటిజన్ల సంఘాలు అనేకసార్లు రైల్వే మంత్రిత్వశాఖకు మొరపెట్టుకున్నాయి. అయితే ఈ విన్నపాలను కేంద్రం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి సీనియర్ సిటిజన్లు బీజేపీకి దూరమయ్యా రన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లను తమవైపునకు తిప్పుకోవడానికే వారిని ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి ….బీజేపీ అమ్ములపొదిలో ఈ అస్త్రం ఎప్పటి నుంచో ఉంది. మనదేశంలోని ప్రజలందరికీ నేరాలకు సంబంధించి విచారించడానికి ఒక చట్టం ఉంది. అదే ఇండియన్ పీనల్ కోడ్. హిందువు, ముస్లిం, క్రిస్టియన్ , పార్సీ, జైన్‌, బుద్ధిస్ట్ …ఇలా మతాలతో సంబంధం లేకుండా ఎవరు నేరం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వారిని విచారిస్తారు. అయితే మనదేశంలో వివాహం, విడాకులు, దత్తత, వారసత్వ హక్కులు ఇలాంటి సివిల్ అంశాలకు సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. ఇలాంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ముస్లింలు తమ ధర్మశాస్త్రమైన షరియాను అనుసరిస్తుంటారు. షరియాకు లోబడే అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే. ఇదిలాఉంటే, సివిల్ అంశాలకు సంబంధించి కూడా అన్ని మతాలవారిని మరీ ముఖ్యంగా ముస్లింలను ఒకే చట్టం కిందకు తీసుకురావడానికి కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది. అదే ఉమ్మడి పౌరస్మృతి.

ఉమ్మడి పౌరస్మృతి వంటి సున్నితమైన అంశంపై తొందరపాటు తగదని మేధావులు సలహాఇచ్చారు. ఏకాభిప్రాయంతోనే యూనిఫామ్ సివిల్ కోడ్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు.అయితే మేధావుల సూచన లను పక్కనపెట్టింది బీజేపీ. ఉమ్మడి పౌరస్మృతి అంశంతో మెజారిటీవర్గం ఓట్లు సంపాదించ డానికి మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. ఉమ్మడి పౌరస్మృతితో మైనారిటీ ముస్లింలను తాము కట్టడి చేయగలు గుతున్నామన్న సంకేతాలు మెజారిటీ వర్గానికి పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ. ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనను కూడా బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచింది. వాస్తవానికి ఇది కూడా చాలాకాలంగా బీజేపీ అమ్ములపొదిలో ఉన్న అస్త్రమే. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించ డానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, సదరు కమిటీ తన నివేదికను అందచేయడం కూడా జరిగిపోయింది. అంతిమంగా ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాద నకు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జై కొట్టింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను మొదటినుంచి ప్రాంతీయ పార్టీల అధినేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సహజంగా లోక్‌సభ ఎన్నికలప్పుడు, జాతీయ అంశాలు తెరమీదకు వస్తుంటాయి.అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబం ధించిన అంశాలు తెరమీదకు వస్తుంటాయి. ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇది. ఇదిలా ఉంటే, లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపో తాయి. లోకల్‌ ఇష్యూస్‌ను ఎవరూ పట్టించుకోరు. కేవలం జాతీయ అంశాలే ప్రధానమవుతాయ న్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు వ్యక్తం చేస్తున్న ప్రధాన అభ్యంతరం. అంతిమంగా ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థ కమవు తుందన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు. అయినప్పటికీ జమిలి ఎన్నికలపై మొండిగా ముందుకు వెళ్లడానికే కమలం పార్టీ నిర్ణయించుకుంది.

   తమిళభాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహం లభించేలా చర్యలు చేపడతామన్న హామీ కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. ఈ హామీలో ఎన్నికల ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఒంటరిపోరు చేస్తోంది. ఒకట్రెండు ఉప ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీ శిబిరంలో ఉన్నాయి. ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే…అన్నాడీఎంకే రెండూ ఈసారి బీజేపీకి దూరంగా ఉన్నాయి. ఇన్నేళ్లూ ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్ట్‌నర్‌గా ఉంటూ ఒకటో రెండో సీట్లు తెచ్చుకునే కమలం పార్టీకి ఈసారి ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి మింగుడుపడటం లేదు. దీంతో తమిళులను ఆకట్టుకోవడానికి తమిళభాషను ప్రోత్సహించే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది కమలం పార్టీ. అలాగే….ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా సంకల్ప్‌ పత్రలో పేర్కొంది బీజేపీ.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్