25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

ముందు చూపు లేని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు

   రాజకీయ పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోల్లో ప్రజలకు సంబంధించిన కీలక అంశాలు మరచిపోతు న్నాయి. ఎల్‌ నినో ప్రభావంతో ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. క్లైమేటిక్ ఛేంజెస్ అనేది అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యమున్న అంశం. వాతావరణ మార్పుల వంటి కీలక అంశం ఏ రాజకీయ పార్టీ మ్యానిఫెస్టోలోనూ కాగడా వేసి వెతికినా కనిపించదు. అలాగే పర్యావరణ అంశాన్ని కూడా అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయి. సంక్షేమానికి పెద్ద పీట వేసి అన్ని పార్టీలు చేతులు దులుపుకుంటున్నాయి.

   లోక్‌సభ ఎన్నికలు అనగానే అందరికీ గుర్తుకువచ్చేది మేనిఫెస్టో. ఎన్నికల ప్రణాళికలను రూపొందిం చడానికి ఆయా పార్టీల నేతలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రజలకు ఇచ్చే వాగ్దానపత్రమే ఎలక్షన్ మేనిఫెస్టో. కొంతకాలంగా మనదేశంలో సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నాయి మేనిఫెస్టోలు. ఎమ్జీ రామచంద్రన్ హయాం నుంచి మనదేశంలో సంక్షేమానికి తగిన ప్రాధాన్యం లభిస్తూనే ఉంది. 1983లో ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి అయ్యాక సంక్షేమానికి పెద్ద పీట వేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు అంటూ అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు నందమూరి తారక రామారావు. దీంతో తారక రాముడు కాస్తా సంక్షేమ రాముడయ్యారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత అందరి దృష్టి సంక్షేమ పథకాలపై పడింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఐదు గ్యారంటీలే ఆ పార్టీని విజయతీరాలకు చేర్చిందని విశ్లేషించారు రాజకీయ పండితులు. కర్ణాటక గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ఎన్నికల కోసం రెట్టించిన ఉత్సాహంతో ఆరు గ్యారంటీలను ప్రకటించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి కూడా సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. దీంతో సంక్షేమ పథకాలనే హైలెట్ చేస్తూ ఎలక్షన్ మ్యానిఫెస్టో రూపొందించింది బీఆర్‌ఎస్. ఇదిలా ఉంటే దాదాపుగా అన్ని రాజకీయ మేనిఫెస్టోలు ప్రజలకు సంబంధించిన కీలక అంశాలు మరచిపోతున్నాయి. ఎల్‌ నినో ప్రభావంతో ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. క్లైమేటిక్ ఛేంజెస్ అనేది అంతర్జాతీ యంగా చాలా ప్రాధాన్యమున్న అంశం. ఇంతటి కీలక అంశంపై ప్రపంచ దేశాలు రెండు లేదా మూడు రోజుల పాటు సమావేశమవుతుంటాయి. ప్రపంచ దేశాలన్నీ కలిసి కొన్ని తీర్మానాలు కూడా ఆమోదిస్తుం టాయి. ఇలాంటి కీలక అంశానికి మన రాజకీయ పార్టీల ఎలక్షన్ మ్యానిఫెస్టోల్లో ఎక్కడా చోటు దొరకదు. ఏ పార్టీ ఈ అంశాన్ని పట్టించుకోదు.

ప్రపంచ వ్యాప్తంగా ధృవప్రాంతాల్లో మంచు కరుగుతోంది. ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతు న్నాయి.. ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకుం టున్నాయి. అనేక దేశాల్లో వరదలు వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు సైంటిస్టులు. దీనికి విరుగుడుగా తాము ఏం చేయబోతున్నామో ఎన్నికల మ్యానిఫెస్టోల్లో వివరించాల్సిన అవసరం రాజకీయ పార్టీలపై ఉంది. మ‌న‌దేశంలో ఆక‌లి మ‌ర‌ణాలు లేవు. అయితే పోష‌కాహార లోపం అనే స‌మ‌స్య మాత్రం తీవ్రంగా ఉంది. మ‌రో ప‌దేళ్లకు గోధుమ లు, మొక్క జొన్న వంటి పంట‌ల దిగుబ‌డులు కొంత మేర త‌గ్గవచ్చన్నది ఒక అంచ‌నా. ఇదే జ‌రిగితే రానున్న రోజుల్లో పోష‌కాహార లోపం మ‌రింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. చివ‌ర‌కు ఈ ప్రభావం చిన్నారుల‌పై ప‌డ‌టం ఖాయం. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని కూడా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోక పోవడం దారుణం.

మనదేశంలో కొంతకాలంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, ఉత్తరాఖండ్ వరదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో వచ్చిన కేరళ వరదలకు పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. 1924లో వచ్చిన వరదలకు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.అప్పట్లో 3,368 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.ఆ త‌రువాత 2018 ఆగష్టులో కేర‌ళకు భారీగా వ‌ర‌ద‌లు వచ్చాయి. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా 357 మందికి పైగా చ‌నిపోయారు. దాదాపు 85 వేల‌మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు. 1924 తరువాత 2021లో వచ్చినవే అతి పెద్ద వ‌ర‌ద‌లు. ఉత్తరాఖండ్ లో ఇటీవలికాలంలో తరచూ వరదలు రావడం అందరూ చూశాం. ఇవి ప్రకృతి విపత్తులు కావు, నూటికి నూరు శాతం మానవ తప్పిదా లే అంటున్నారు పర్యావరణవేత్తలు.ఇందుకు సంబంధించి పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ఇచ్చిన నివేదికను అన్ని రాజకీయ పార్టీలు బుట్టదాఖలు చేశాయి. పర్యావరణంపై ఇప్పటికైనా పాల‌కుల మైండ్ సెట్ మారాలి. వ‌ర‌ద‌లు, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజ‌ల‌ను ర‌క్షించ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసు కోవాలి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశానికి పెద్దపీట వేయాలంటున్నారు పర్యావరణవేత్తలు. అయితే పర్యావరణవేత్తల సలహాలు, సూచనలను పాలకవర్గాలు పట్టించుకోవడం లేదు. వీటన్నిటితో పాటు బాలల సంక్షేమాన్ని అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి. చిన్నారులకు ఓటు హక్కు లేకపోవడమే దీనికి కారణమన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ఏమైనా ఎన్నికల ప్రణాళిక రూపొందించడం లో పాలకుల ప్రాధాన్యాలు మారాల్సిన అవసరం ఉంది అంటున్నారు మేధావులు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్