తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. జైల్లో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని లేఖలో వివరించారు. తనను జైలులో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. జైలు అధికారులు కూడా వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నారు. జైలు అధికారులు, అధికార దుర్వినియోగం చేసిన వారికి జైల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. సత్యేంద్ర జైన్‌కు అత్యంత సన్నిహితుడిని జైలు అధికారిగా నియమించుకున్నారన్నారు. జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారన్నారు. ఎవరు బెదిరించినా తాను వెనక్కు తగ్గనంటూ సుఖేష్ విడుదల చేసిన లేఖలో వివరించారు.
తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ
0
497
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


