మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితులను 4 గంటల్లోనే పోలీసు లు అరెస్టు చేశారు. వారి నుంచి చోరీకి గురైన బంగారాన్ని ఆల్వాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరిని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలి పారు. నిందితుల్లో ఏ 1 నిందితునిపై గతంలో ఐదు చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. బాల్యం నుంచే చోరీలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది అని ఏసీపీ తెలిపారు. రెండో నిందితుడి గురించి విచారణ కొనసాగుతోందని రాములు తెలిపారు. ఆల్వాల్ పోలీసులను ఏసీపీ అభినందించారు.


