తెలంగాణ రాజకీయలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ… అధికార, ప్రతిపక్షల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు సీఎం, మాజీ సీఎంలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ ఘర్షణ ఎక్కడికి దారితీస్తుంది?…ఇంతకీ.. వారిద్ద రికీ వచ్చిన పంచాయతీ ఎక్కడ..? ఎన్నికల్లో ఎవరు చెప్పేది ప్రజలు విశ్వసిస్తారు..? ప్రజలను పరేషాన్ చేసి ఓట్లు కొల్లగొట్టాలనుకోవడమే ఈ రెండు పార్టీల ఎజెండానా..? ప్రచారం రూటు మారుతోందా..?
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్… ఎదుర్కోబోతున్నమొదటి పరీక్ష పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మీద భారత జాతీయ కాంగ్రెస్ కమిటి గట్టి నమ్మకం పెట్టుకుంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ప్రతి స్థానం కీలకమనీ భావిస్తున్న అధినాయకత్వం తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలపై పెద్ద ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో 17 స్థానా ల్లో కనీసం 14 స్థానాలను కైవసం చేసుకోవాలని రాష్ట్ర నేతలు. భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి, అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున అత్యధిక స్థానాలు గెలిపించి, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా కాంగ్రెస్ పెద్దల వద్ద మార్కులు కొట్టే యాలని రేవంత్ కసితో పని చేస్తున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ ఆర్, పీసీసీ ఛీఫ్‍గా డి. శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు పదవులు తానే నిర్వహిస్తున్నారు రేవంత్. ఎంపీ ఎన్నికల్లో సరైన ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కుతుంది! దాంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవ డం కోసం, పార్ల మెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందన్న భావనతో ఇతర పార్టీల నేతలకు వలవేస్తూ.. కాంగ్రెస్ కండువా కప్పేస్తు న్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయడం, ఇటు ప్రతిపక్షాల దూకుడుకూ కళ్లెం వేయడం, రెండు జరగాలంటే, రేవంత్ ముందు ఉన్న తక్షణ లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయమే. అందుకే రాజకీయ చదరంగంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత, బీఆర్ ఎస్ వైఫల్యాలను పదేపదే ప్రజల్లోకి తీసుకువెళ్లి, మొత్తం మీద బీఆర్ఎస్‍ను కాంగ్రెస్ ప్రతిపక్షంలో కుర్చోబెట్టింది. అయితే తెలంగాణ లో ఇదే పదేళ్ళ కాలంలో క్రమం తప్పకుండా రెట్టింపు వేగంతో గ్రామలకు చేరుకున్న కమలం పార్టీ కూడా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. మరో వైపు కాషాయ పెద్దలు పార్లమెంట్ ఎన్నికల పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. తమ వందరోజుల పాలన రిఫరండంగా భావించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని హస్తం నేతలు చెబుతుండటంతో, అదే అస్త్రాన్ని ఎదురుదాడికి ప్రయోగిం చాలని బీజేపీ ,బీఆర్ఎస్ భావిస్తున్నాయి. వందరోజుల్లొనే కరువు వచ్చిందని, పాలన చేత కాక పంటలు ఎండబెడుతు న్నారని మాజీ సీఎం కేసీఆర్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఎండిన పంటల పరిశీలన పేరుతో పర్యటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలకు ప్రజలు మరో సారి మోసపోవద్దని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభిం చారు.
టీ కాంగ్రెస్ మాత్రం పదేళ్ళు అధికారంలో ఉన్నా మోదీ, కేసీఆర్ లు తెలంగాణకు చేసింది ఏమి లేదని, అభివృద్ది పక్కనపెట్టి కేసీఆర్ అవినీతి చేస్తే, మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శ నాస్త్రాలు కురిపిస్తోంది. ఇది ముమ్మటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే అని కేసీఆర్ ఎత్తి చూపుతుంటే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు ఉన్న కేసీఆర్ పాలనే కరువుకు కారణమని, ప్రాజెక్టుల కుంగుబాటు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బీజేపీ కూడా ఈ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు అంశాలే కీలక ప్రచార అస్త్రాలు కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం, మాజీ సీఎం రాజకీయ పరమైన విమర్శలు చేసుకుంటూ, తిట్ల దండకాలతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు షరా మాములే అయినా, కర్యకర్తల్లో జోష్ పెంచేందుకు నోరు పారేసుకోవడం నయాట్రెండ్ అయింది.. కాని లోక్ సభ ఎన్నికల ప్రచారం అడుగు ముందుకు పడక ముందే తిట్లు పీక్స్ కీ చేరుతున్నాయి. ప్రజలు ఈ ఎన్నికల్లో అభ్యర్ధు లు…పార్టీలు.. వాటి సిద్దంతాలు చూస్తారా లేక నేతలు ప్రచారంలో వీళ్ల ప్రసంగాలను చూసి ఓట్లు వేస్తారా. .! చూడాలి మరి ఎన్నికలు ముగిసే నాటికే పొలిటికల్ వార్ లో విన్నర్ ఎవరో తేలేది.


