తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. SIBలో ఆధారాల విధ్వంసం కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్తగా ఓ ఎమ్మెల్సీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో జూబ్లిహిల్స్‌లోని ఎమ్మెల్సీ నవీన్‌రావు గెస్ట్‌హౌస్‌లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం తో గెస్ట్ హౌస్ట్లో తనిఖీలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే ఉంది ఈ నవీన్ రావు గెస్ట్‌హౌస్. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్‌కు డెన్ గా మార్చుకున్నారు. BRS అధినేతకు అత్యంత సన్నితుడిగా ఉన్నాడు నవీన్ రావు. ఆయన గెస్ట్ హౌస్ లో భుజంగరావు ఆధారాలన్నీ మాయం చేశాడు. నేడో రేపో ఎమ్మెల్సీ నవీన్ రావు ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీని ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచార ణకు పిలవనున్నారు పోలీసులు.
ఫోన్ ట్యాపింగ్ రోజుకో మలుపు
0
227
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


