ఇంగ్లండ్ జాతీయ జట్టులో చేరిన బ్రిటన్ ప్రధాని

   క్రికెట్ వీరాభిమాని అయిన భారత సంతతి, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి క్రీడపై తన అభిమా నాన్ని చాటుకు న్నారు. శుక్రవారం ఆయన ఇంగ్లండ్ జాతీయ జట్టులో చేరారు. అంతేకాకుండా, నెట్ సెషన్‌లో కూడా పాల్గొన్న ఆయన తన బ్యాటింగ్ నైపుణ్యాలతో అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్‌లో నెట్ ప్రాక్టీస్ చేయడంపై రిషి హర్షం వ్యక్తం చేశారు.

  నెట్ ప్రాక్టీస్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని..జిమ్మీ ఆండర్సన్‌తో ముచ్చటించారు. జిమ్మీ బౌలింగ్ ఎదుర్కో వాల్సి వస్తుందని తెలిసే తాను గత వారం కొంతసేపు అక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్లానన్నారు. తనకు మరీ దూకుడుగా బౌలింగ్ చేయొద్దని కూడా రిషి సరదాగా సూచించారు. మరోవైపు, టీంలోని యువ క్రీడాకా రులతో కూడా ఆయన ముచ్చటించారు. అనేక మంది బాలబాలికలు రిషి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. చిన్నారుల బౌలింగ్‌లో కూడా నెట్ ప్రాక్టీస్ చేసిన ఆయన, ఓ చిన్నారి వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ కూడా అయ్యారు. తనను బౌల్డ్ చేసిన బాలుడిపై ప్రశంసలు కురిపించారు. అనంతరం, తన నెట్ ప్రాక్టీస్ సెషన్ తాలూకు వీడియోను నెట్టింట పంచుకున్నారు రిషి. ఆయన తన బ్యాటింగ్ ఎలా ఉందని ఇంగ్లండ్ క్రికెట్‌ టీంను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అంతా బాగానే ఉంది. కానీ, మరికొన్ని నెట్ సెషన్లు అవసరమ వుతాయని ఇంగ్లండ్ టీం సరదాగా రిప్లై ఇచ్చింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Latest Articles

రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు

విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్‌ ముస్సోరీలోని హోమ్‌ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్