ఆగకుండా పరుగులు పెడుతున్న పసిడి ధరలు

     బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ధరలను నియంత్రణ సాధ్యం కావడం లేదు. పసిడి ధరలు ఆగకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇంతలా పెరగడం ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. వెండి ధరలు కూడా దాంతో పాటే తామేం తక్కువా? అన్నట్లు ఆకాశం వైపు చూస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

       త్వరలోనే పది గ్రాముల బంగారం ధర లక్షకు చేరుకునే అవకాశం ఉందన్నది మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. పేదా, మధ్యతరగతి ప్రజలు అసలు బంగారం వైపు చూడలేని పరిస్థితి రానున్న రోజుల్లో రానుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. బంగా రం ధరలు మాత్రం ఎవరూ కొనలేని పరిస్థితులకు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా అంతే వేగంగా పరుగులు పెడుతున్నాయి. దిగుమతులను తగ్గించిన కారణంగానే ధరలు పైకి ఎగబాకుతు న్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65 వేల 350 రూపా యలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71 వేల 290 రూపాయలుగా కొనసాగు తుంది. కిలో వెండి ధర 87 వేల రూపాయలుగా ఉంది.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్