ఏనుగు బీభత్సం … రంగంలోకి దిగిన అధికారులు

    కొమురంభీం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏనుగును బంధించి అటవీప్రాంతంలోకి తరలించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పెంచికల్‌ పేట్‌-బెజ్జూర్‌ మండలాల సరిహద్దుల్లో ఏనుగు ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పారెస్ట్‌ అధికారులు.. ఏనుగు కోసం గాలిస్తు న్నారు. కాసేపటి క్రితం జైహింద్‌పూర్‌ సమీపంలో ఆ ఏనుగు కనిపించినట్టు తెలుస్తోంది. ఆయా గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 16 గ్రామాల్లో అటవీశాఖ అలర్ట్‌ ప్రకటించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లావైపు ఏనుగు తప్పిపోయి వచ్చి నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావొద్దని డప్పు చాటింపు వేయిం చారు.

గత రెండు రోజులుగా ఏనుగు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గజరాజు సంచరిస్తూ కనిపిం చిన వారిపై దాడి చేస్తోంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లిలో పొలం పనులు చేసుకుంటున్న దంపతులపై దాడి చేసింది. ఈఘటనలో తీవ్ర గాయాలపాలైన బూరేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్‌ మృతి చెందాడు. మరోవైపు పెంచికల్ పేట్‌ మండలం కొండపల్లిలో మరొకరిని తొక్కి చంపేసింది ఏనుగు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్