ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ బెంగళూరు తలరాత మారలేదు. మునుపటి ఫామ్‌నే కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక నేడు లక్నోతో పోరుకు సిద్ధమైంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. పంజాబ్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి రెండో విజయాన్ని నమోదు చేయాలనే తపనతో ఉంది. వరుస ఓటములకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఘోర ఓటమిపాలైన లక్నో తరువాతి మ్యాచ్‌లో పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే జోరును బెంగళూరుపై సైతం కొనసాగించాలనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బెంగళూరును కూడా ఓడించి రెండో విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదనే టాక్ వినిపిస్తోంది.
అభిమానుల్లో జోష్ పెంచిన ఐపీఎల్ 17వ సీజన్
0
246
Previous article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


