ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

     ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..ఇది బీజేపీకి ఎదురు దెబ్బగా భావించట్లేదని చెప్పారు. ఏ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఉండదని వివరించారు. లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. అసలేం జరిగిందని తాము దీన్ని ఎదురు దెబ్బగా భావించాలో చెప్పండి..? ఎలక్టోరల్ బాండ్ల రద్దు చూసి సంబరపడుతూ చిందు లేస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అసలు ఈ రోజు నిధులు రాకడ గురించి ఇంత సులభం గా తెలిసిందం టే అది ఎన్నికల బాండ్ల వల్లేనన్నారు. 2014కు ముందు ఏ దర్యాప్తు ఏజెన్సీ అయినా ఈ వివరాలను సేకరించగలిగేదా..? లోపాలే లేని వ్యవస్థ ఉండదు. అయితే, ఎప్పటికప్పుడు వ్యవస్థలను మెరుగుప రుచుకుంటూ వెళ్లాలని మోదీ అన్నారు.

     తాను చేసే ప్రతి పనిలోనూ రాజకీయం చూడొద్దన్నారు. దేశం కోసం పనిచేస్తానని, తనకున్న అతిపెద్ద బలం తమిళ నాడేనని కూడా చెప్పారు. ఓట్లే తన ప్రాధాన్యత అయ్యి ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు ఇంత చేసి ఉండేవారం కాదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు ఆ ప్రాంతాన్ని దాదాపు 150 సార్లు సందర్శించారని, గత ప్రధానులకంటే ఎక్కువగా తాను మూడు సార్లు ఈశాన్య రాష్ట్రాల పర్యటన చేపట్టాన న్నారు. తాను రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన తనకు ఎన్నికల్లో గెలుపే పరమావధి కాదని వివరించారు. ఎన్నికల బాండ్లు ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందంటూ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు స్టేట్‌బ్యాంక్ ఇండియా బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించింది. ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని బహిర్గతం చేసింది. దీని ఆధారంగా కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. క్రిమినల్ కేసులున్న అనేక సంస్థలు ఎన్నికల బాండ్లు కొన్నాయని ఆరోపిం చింది.

Latest Articles

విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్