దాదాపు 30 ప్రదేశాల్లో ఎన్ ఐఏ దాడులు

          దేశవ్యాప్తంగా NIA అధికారులు దాదాపు 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్, చండీఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ ద‌ర్యాప్తు సంస్థ నేడు చేస్తుంది. ఉగ్రవాదుల, గ్యాంగ్ స్టర్లతో లింకున్న కేసులో ద‌ర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల‌కు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేష‌న్‌లో భాగం అయ్యాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.జ‌న‌వ‌రి 6న ఉగ్రవాదం, గ్యాంగ్ స్టర్, డ్రగ్ స్మగ్లింగ్‌కు చెందిన భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన నాలుగు ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి యూఏపీఏ చట్టిం కింద ఆ ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది. అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్