గులాబీమయమైన కరీంనగర్‌ సిటీ

     పార్లమెంటు ఎన్నికల శంఖాన్ని పూరించనున్నారు గులాబీ బాస్. కరీంనగర్‌ కదనభేరి సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌. ఎటు చూసినా తోరణాలు, జెండాలతో.. కరీంనగర్ గులాబీమయ మైంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే కదనభేరి సభకు సర్వం సిద్ధమైంది. సభకు లక్షమందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ లీడర్లు. సెంటి మెంట్‌గా భావించే కరీంనగర్ నుంచి..పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్.

    అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో… భారీ జనసమీకరణ పై దృష్టిపెట్టాయి పార్టీ శ్రేణులు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ చరిష్మా కేసీఆర్ ఇమేజ్ తగ్గలేదని నిరూపించేందుకు కదన భేరి సభతో నిరూపించుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇందుకోసం కరీంనగర్ లో జరిగే సభకు లక్షమంది హజరయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని నియెజకవర్గాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ.. క్యాడర్ లో జోష్ నింపుతున్నారు

      నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో పెద్దగా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు గులాబీ బాస్. కేవలం కృష్ణా ప్రాజెక్టుల అంశం వరకే పరిమితమయ్యారు. కానీ కరీంనగర్ కదనభేరి ఎన్నికల ప్రచారసభ కావడంతో మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపైనే చర్చ సాగు తుంది. కాంగ్రెస్, బీజేపీపై ఎలాంటి విమర్శ నాస్త్రాలను సంధిస్తారో అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు కరీంనగర్ ఓ సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవుతూ వచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర విషయం లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయా ల్లోకి వెళ్లడానికి కరీంనగర్ లోక్‌సభను ఎంచుకున్నారు. అక్కడి నుంచి 2004లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండుసార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలో కరీంన గర్ నుంచే గెలిచారు. కరీంనగర్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని, బహిరంగ సభల్లో ప్రస్తావి స్తుంటారు కేసీఆర్.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్