ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ స్పీడు పెంచింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.20కి బేగంపేట విమానాశ్రయం చేరుకుం టారు అమిత్ షా. 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్‌లో దిశానిర్దేశం చేస్తారు.3.15 నుంచి 4.25 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం బూత్ కమిటీ అధ్యక్షులు ఆపై స్థాయి నేతల మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారు. 4.45 నుంచి 5.45 వరకు ఐటీసీ కాకతీయలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తత, కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనమ వుతారు అమిత్ షా
నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
0
391
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


