ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డిని ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డికి బీ-ఫామ్ అందించారు పీసీసీ అధ్యక్షులు, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నవీన్ రెడ్డిని ఖరారు చేయగా.. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకపోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఒకేసారి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి
0
355
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


