పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌కు పోలీసులు పుట్టినరోజు వేడుకలు చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ ఠాణాలో చోటుచేసుకుంది. సమస్యలపై వచ్చిన ఫిర్యాదారులపై శ్రద్ద పెట్టడంలో ఆసక్తి చూపని ఎస్సై అదే పోలీస్ స్టేషన్లో ఓ మర్డర్ కేసులో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజున కేక్ కట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రౌడీ షీటర్ జన్మదిన వేడుకల్లో ఎస్సై కట్ చేసి తినిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రవైట్ కార్యక్రమాలు నిర్వహిం చకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ… ఎస్సై నిబంధనలు మర్చిపోయి ఇలా ప్రవర్తించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నత పోలీసు అధికారులు ఎస్సైపై చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.
పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌కు పుట్టినరోజు వేడుకలు
0
337
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


