26.7 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

క్యాన్సర్ బారిన ఇస్రో చైర్మన్ సోమనాథ్

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ‘ఆదిత్య ఎల్‌ 1’ ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఓ మలయాళం వెబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.

    చంద్రయాన్‌-3 ప్రయోగం సమయంలోనే ఆరోగ్య సమస్యలొచ్చాయని చెప్పారు. ఆ సమయంలో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. కానీ, ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకు న్నానని… కొద్ది సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని వివరించారు. ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్‌లు చేయించానని చెప్పారు. అప్పుడే తన కడుపులో కణితి పెరిగిందని. మరో రెండు మూడు రోజుల అనంతరం క్యాన్సర్‌ అని నిర్ధారణ అయ్యిందని తెలి పారు. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ చెప్పా రు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులతో పాటు సహోద్యోగులు ఆందోళనకు గురయ్యారన్నారు. గతేడాది సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్‌1 ప్రయోగం చేపట్టిన తర్వాత ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నానని… అలా అవన్నీ భరించాల్సి వచ్చిందని సోమ్‌నాథ్‌ చెప్పారు తొలుత కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్‌కు పూర్తి పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయంపై ఇప్పుడు అవగాహన వచ్చిందని ఇస్రో చీఫ్‌ అన్నారు.

Latest Articles

ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపి ఉంటుంది? అసలు నిజం ఇదే!

మనకు ఇష్టమైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచినప్పుడు అందులో సగం వరకు మాత్రమే చిప్స్ ఉండి, మిగతా భాగం మొత్తం గాలితో నిండిపోయి ఉండటం చూసి చాలా మందికి నిరాశ కలుగుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్