టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత వేమిరెడ్డి

    ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్‌ పనిగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రం, ప్రజలపై ఎలాంటి గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఉండేందుకే ఏమాత్రం అర్హత లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. సీఎం జగన్‌ అవలంబిస్తోన్న తీరును చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. అహంకారంతో ఇష్టానుసారం రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం జగన్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. బాబాయ్‌ హత్యపై సమాధానం చెప్పేందుకు సిద్ధమా అని జగన్‌కు సవాల్‌ విసిరారు. రాజకీయ రౌడీలను నిమిషంలోపే అణచివేసే శక్తి టీడీపీకి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్