39.2 C
Hyderabad
Monday, April 15, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ముస్తాబైంది. ఈనెల 3 నుండి 16వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రంగు రంగుల విద్యుత్‌ కాంతులు, పుష్పాలంక రణతో ఆలయం దేదీప్యమానంగా ఉంది. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసారు అధికారులు.

అమ్మవారి సన్నిధిలో…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణరావు కుటుంబ సమేతంగా దర్శించుకు న్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం న్యాయమూర్తి దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

ఉత్సవ కమిటీ

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంకు ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. మహాశివరాత్రి ఉత్సవాల వేళ నియమించిన ఈ ఉత్సవ కమిటీకి సుధాకర  యాదవ్‌ చైర్మన్ గా వ్యవహరిం చనున్నారు. మరో 13మందిని కమిటీ సభ్యులుగా నియమించారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు ఛైర్మన్‌ సుధాకర్‌.

రేవంత్‌ చిత్రపటానికి పాలాభిషేకం

పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్‌ మున్సిపాల్టీ శివాలయం క్రాస్‌ రోడ్డు వద్ద ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు నేతలు. అభయ హస్తం 6 గ్యారంటీ పథకాలలో భాగంగా గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు నేతలు.

విదేశీ విద్యా పథకం

విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ చేసేందుకు మహాత్మా జ్యోతిబావూలె బీసీ విదేశీ విద్య పథకం కింద అర్హులైనవారు ఈనెల 5వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ పేర్కొంది. ఈ మేరకు కమీషనర్‌ బాలమాయాదేవి ప్రకటన విడుదల చేస్తూ దరఖాస్తుల నమోదుకు ఏప్రిల్‌ 5వ తేదీ చివరి తేదీగా తెలిపారు.

నాలుగు విడతల్లో వాల్యుయేషన్‌

ఇంటర్‌ జవాబు పత్రాల వాల్యుయేషన్‌ ప్రక్రియను మొత్తం నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నారు బోర్డ్‌ అధికారులు. తొలి విడత ప్రక్రియ ఈనెల 16న ప్రారంభం కాగా, 20, 22, 24 తేదీల్లో విడతల వారీగా ఈ వాల్యుయేషన్‌ జరగనుంది. స్పాట్‌ వాల్యుయేషన్‌ జరిగే తేదీలకు ఒక రోజు ముందుగా లెక్చరర్లు రిపోర్ట్‌ చేయాల్సి ఉంది.

అవినీతి చేప

గుంటూరు జిల్లా ఆర్‌ డబ్లు ఎస్‌ శాఖలో పనిచేస్తున్న A E శివరామకృష్ణ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్‌ వద్ద నుండి లక్షా 68 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా దొరికాడు. శివరామకృఫ్ణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఏ ఎస్ పి మహేష్ తెలిపారు.

శ్రీపాదరావుకు నివాళులు

మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి కార్యక్రమంను కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ నేతలు నిర్వహిం చారు. కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో అయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 4 నుండి స్ట్రీమింగ్‌

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్న నిహారిక కొణిదెల తాజాగా సాగు అనే షార్ట్‌ ఫిల్మ్‌ను నిర్మించారు. మార్చి 4 వ తేదీన ఈ ఫిల్మ్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తన ఇన్‌స్ట్రావేదికగా పేర్కొన్నారు నిహారిక. అయితే ఈ షార్‌్ ఫిల్మ్‌కు అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్ఢ్‌ దక్కిందన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

డైరెక్టర్‌ కిశోర్‌రెడ్డి వివాహం

శర్వానంద్‌ హీరోగా శ్రీకారం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ కిశోర్‌రెడ్డి ఒక ఇంటి వాడయ్యాడు. తెలుగు యాంకర్‌ కృష్ణ చైతన్యను వివాహమాడారు. మార్చి ఒకటిన హైదరాబాద్‌ మామిడిపల్లి వెంకటేశ్వరస్వామి సాక్షిగా వీరి వివాహం జరిగింది. ఈ మేరకు వివాహంకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసారు.

4కె రన్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 4కె రన్ నిర్వహిం చారు, ఉప్పల్‌ నియోజకవర్గం E C I L గ్రౌండ్స్‌లో జరిగిన రన్‌ను రాచకొండ పోలీస్ కమిష నర్ తరుణ్ జోష్ జెండా ఊపి ప్రారంభించారు.

Latest Articles

‘దర్శిని’ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్

వీ4 సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ ఎల్వీ సూర్యం నిర్మాతగా, డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్శిని’. వికాస్‌, శాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కాన్సెప్టుతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్