ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మోతెక్కను న్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాధా రణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఆవర్తనం వేడెక్కడం వంటి పరిస్థితులు వేసవికాలం పొడవునా కొనసాగుతాయని, ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయని చెప్పారు. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల మోత
0
269
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


