ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కొనసాగుతోంది. ఇవాళ అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇవాళ ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి యూకే వెళ్తుంండటంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో ద్వేషాన్ని అంతంచే యాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. ద్వేషాన్ని మన మనసులోని ప్రేమ ద్వారా జయించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్‌యాత్ర
0
239
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


