38.2 C
Hyderabad
Sunday, May 3, 2026
spot_img

యూపీలో కొనసాగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర

     ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కొనసాగుతోంది. ఇవాళ అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్‌, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్‌ తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇవాళ ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి యూకే వెళ్తుంండటంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో ద్వేషాన్ని అంతంచే యాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. ద్వేషాన్ని మన మనసులోని ప్రేమ ద్వారా జయించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదని ఆరోపించారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్