చీపురుపల్లిలో బొత్స, గంటా పోటీ

       ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర రాజకీయాల ముఖ చిత్రం మారబోతోంది. రానున్న ఎన్నికల్లో కీలక రణరంగంగా మారబోతోంది. కాకలు తీరిన కాపు నేతలు సమరానికి సై అంటున్నారు….బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావుల మధ్య ఆసక్తికర పోటీ కి విజయ నగరం చీపురుపల్లి వేదిక అవుతుంది.

      ఉత్తరాంధ్ర తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆ తాజా, మాజీ మంత్రులు మధ్య టగ్ ఆఫ్ వార్ కి ఆపరేషన్ చీపురుపల్లి రెడీ అయింది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపు రుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును టీడీపి బరి లోకి దించేందుకు సిద్ధమైంది. ఇద్దరూ కాపు సామాజిక నాయకులు కావడం, ఇద్దరూ ఉత్తరాంధ్రలో కీలక నేతలు గా ఉండటం తో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొత్సపై గంట పోటీ అధికా రికంగా ప్రకటించకపోయినా, విస్తృతమైన చర్చ మాత్రం నడుస్తుంది.. ఉత్తరాంధ్ర లో బొత్సను ఢీ కొట్టాలం టే గంట సరైన అభ్యర్థి గా టీడీపి భావిస్తోంది. దీంతో పార్టీ వ్యూహ రచన చేస్తుంది అనే ప్రచారం ఉంది..

      విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి నాలుగు సార్లు పోటీ చేసిన బొత్స మూడు సార్లు విజయం సాధించారు. ఈ సారి మళ్లీ చీపురుపల్లి నుండి బొత్స పోటీ చేయబోతున్నారని వైసిపి వర్గాల మాట. మరోవైపు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపిగా పోటీ చేయనున్నారు. ఇప్పటికే బొత్స శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు సమన్వయ కర్త గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర లో బొత్స ను కట్టడి చేయాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకుడు కావాలని టీడీపి పార్టీ భావిస్తోంది. గంట శ్రీనివాస్ 1999 అనకాపల్లి ఎంపీ, 2004 చోడవరం ఎమ్మెల్యే, 2009 లో అనకాపల్లి ఎమ్మెల్యే, 2014 లో భీమిలి, 2019 లో విశాఖ ఉత్తరం నుండి పోటీ చేసి ఓటమి లేని నేత గా రికార్డు సాధించారు. దీంతో ఈ సారి బొత్సకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దింపే వ్యూహాలు చక చక నడుస్తున్నాయి.

       చీపురుపల్లి నియోజకవర్గం మొదట నుండి టీడీపి కి కంచుకోట. టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి 1983, 1999 వరకు సైకిల్ కే మద్దతు. 1994, 1999 ఎన్నికలో గద్దె బాబూరావు గెలుపొందారు. తర్వాత నుంచి బొత్స హవా మొదలైంది. 2004లోనూ, 2009 లోనూ కాంగ్రెస్ నుండి బొత్స విజయం సాధించారు. 2014 లో కిమిడి మృణాళిని టీడీపి నుండి పోటీ చేసి బొత్స సత్యనారాయణ పై గెలుపొందారు. 2019 లో బొత్స వైసిపి నుండి పోటీ చేసి కిమిడి మృణాళినిపై విజయం సాధించారు. మొత్తానికి చీపురుపల్లి నియోజకవర్గం లో ఇప్పటికీ 9 సార్లు ఎన్నికలు జరగగా 6 పర్యాయాలు టీడీపి విజయం, 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసిపి గెలుపొందారు. దీంతో ఈ సారి ఆ నియోజకవర్గం లో టీడీపి విజయం పై ఆ పార్టీ వ్యూహా త్మకంగా అడుగుల వేస్తోంది. గంట శ్రీనివాస్ బరి లోకి దింపుతుండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ హెచ్చింది. బొత్స పై గంటా విజయం సాధిస్తే…ఉత్తరాంధ్ర లో ఆసక్తికర పరిణామాలు మరిన్ని జరిగే అవ కాశం ఉంది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్