Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

పోరుగడ్డపై పొలిటికల్ టార్గెట్

        తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోందా…? వీటి ఆధారంగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉందా…? ఇప్పటికే క్యాడర్ ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోందా…? బీఆర్ఎస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ఆరు గ్యారెంటీలపైనే విమర్శలు చేయడమే దీనికి సంకేతమా…? ప్రజల మైండ్ సెట్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నంలో గులాబీ పార్టీ నిమగ్నం అయిందా…?

        అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరుగ్యారెంటీలను రానున్న పార్లమెంట్‌ ఎన్నికల అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. వీటి అమలుతీరును ప్రశ్నిస్తూ రాజకీయ లబ్దిపొందాలని గులాబీ అధిష్టానం ప్లాన్‌ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అమలు కాని హామీలను ఇచ్చిందని ఇప్పటికే పార్టీ సమావేశాల్లో క్యాడర్ కు వివరిస్తూ సన్నద్ధం చేస్తోంది. ప్రజల మైండ్ ను డైవర్టు చేసి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచేందుకు గులాబీ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకోసం గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ను ఇరుకుపెట్టాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని 13 అంశాలను ప్రస్తావించడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. వందరోజుల్లో హామీల అమలుకు శ్రీకారం చుడతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి… ఆ గడువు లోక్ సభ ఎన్నికలకు ముందే ముగుస్తుంది. దీంతో ఇదే అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్నికల అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. అదే విధంగా 420 హామీలు, కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్ లోని అంశాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి కాంగ్రెస్ తీరును ఎండగట్టే ప్రణాళికను గులాబీ పార్టీ ప్రారంభించింది. గ్రామస్థాయి నుంచి వ్యతిరేకత వస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టేక్కుతామనే భావనతో ముందుకెళ్లేందుకు బిఆర్ఎస్ సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది.

        పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ ను ఇప్పటి నుండే గులాబీ అధిష్టానం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలా ఉంది… పార్టీపై కార్యకర్తల్లో అభిప్రాయం ఎలా ఉంది. ప్రజల మనో భావాలు ఎలా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయనే అంశాలను పార్లమెంట్, అసెంబ్లీ సన్నాహక సమావేశాలతో అధిష్టానం ఆరా తీస్తోంది. మరోవైపు కాంగ్రెస్ గత పాలనలో, ప్రస్తుత పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వారి పాలనలో వైఫల్యాలను వివరిస్తున్నారు. సమష్టి గా పనిచేయకపోవడంతోనే పరాజయం పాలయ్యాయని, పార్టీపై ప్రజల్లో సానుకూలత ఉందని లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే క్యాడర్, నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని…. ప్రభు త్వం ఇచ్చిన హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిస్తున్నారు.

        పార్టీ క్షేత్రస్థాయి పటిష్టతపై గులాబీ పార్టీ అధిష్టానం దృష్టిసారించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీపై విమర్శలకే పరిమితం అవుతుందనే భావన కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకులే బహిరంగంగా పేర్కొంటున్నారు. క్యాడర్, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించినప్పటికీ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు,ఆరుగ్యారెంటీలు ఎట్టిపరిస్థితుల్లో అమలుకు సాధ్యం కాదని, చేయలేదని, అందుకు నిధులు కూడా సరిపోవని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచనలిస్తున్నారు. మరోవైపు 6గ్యారెంటీల్లో 13 అంశాల్లో కేవలం 2 అంశా లను మాత్రమే అమలుచేసి మిగిలిన 11 అంశాలను గాలికి వదిలివేశారని ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.

      బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన దళితబంధు,డబుల్ బెడ్ రూమ్, బీసీబంధు, మైనార్టీలకు లక్ష, ఇంటినిర్మా ణానికి సాయం, యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా అమలు చేయక పోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపై ఆ ఎఫెక్ట్ పడింది. అయితే తమపై ఏర్పడిన వ్యతిరేకత మూడు నెలల్లోనే పోతుందా అన్న భావన నాయకుల్లో నెలకొంది. దీంతో ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలుచేయలేదని నెలలు గడుస్తున్నా హామీలను నిలబెట్టుకోవడం లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. డిసెంబర్ 9న అధికారం లోకి రాగానే రైతురుణమాఫీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని… ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని ప్రణాళికలు రూపొం దిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందాలని గులాబీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాస్తాయా లేకుంటే విఫలమవుతాయా అనేది లోక్ సభ ఎన్నికల ఫలితాల వరకు చూడాలి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్