పదేళ్లలో వారణాశి రూపురేఖలు అద్భుతంగా మారిపోయాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బనారస్ యూనివ ర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. పదేళ్లలో ‘వికాస్ కీ గంగా’ కాశీని పెంచి పోషించిందని మీరంతా చూశారని అన్నారు. ఇదీ కాశీ సామర్థ్యం మహాదేవుని ఆశీస్సుల శక్తి అని పేర్కొన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇంతవరకూ సాధించిన అభివృ ద్ధిని ప్రధాని వివరించారు. వారణాశిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కి శంకుస్థాపన చేశారు. దీనివల్ల విద్య, శిక్షణ, మౌలిక రంగాల్లో అపూర్వ ప్రగతి సాధ్యం కాగలదని ప్రధాని అన్నారు. 13 వేల కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోది ప్రారంభిస్తున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన వారణాశి సందర్శించడం ఇది 43వ సారి. రాత్రే వారణాశి చేరుకున్న మోదీ ఈ మధ్య ప్రారంభించిన శివపూర్- పుల్వారియా- లహర్తరా మార్గాన్ని పరిశీలించారు. సంత్ గురు రవిదాస్ జన్మస్థలి సందర్శించి పూజలు చేసారు. సంత్ రవిదాస్ 647వ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని సంత్ హరిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వారణాశిలో ప్రధాని మోదీ పర్యటన
0
211
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


