జ‌లాశయాల‌పై ప్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తి

        పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్న‌యంగా పుణ‌రుత్పాద‌క విద్యుత్తు ప్రోత్స‌హాకంలో భాగంగా జ‌లాశాయాల‌పై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తి చేయ‌బోతున్నామ‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. స‌చివాల‌యంలో జ‌లాశాయాల‌పై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తిపై సాగునీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి సింగరేణి సంస్థ ఉన్న‌త అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని పలు జలాశయాల్లో 1000 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తి ల‌క్ష్యంగా ప్లాంట్ల ఏర్పాటుకు తగిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వీటి ఏర్పాటుకు సాధ్య సాధ్యాల‌పై అద్య‌య‌నం చేసి మ‌త్స్య సంప‌ద‌కు ఏలాంటి న‌ష్టం వాటిల్ల కుండ డిపిఆర్ లు సిద్ధం చేయాల‌ని చెప్పారు. కాలుష్య ర‌హిత విద్యుత్తు ఉత్ప‌త్తికి ప్ర‌భుత్వం మొద‌టి ప్రాధ‌న్య‌త ఇస్తున్న నేప‌త్యంలో భాగంగానే ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తిని ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తికి ఇరిగేష‌న్ శాఖ నుంచి కావాల్సిన స‌హాకారం అందించ‌ డంతో పాటు ప్రోత్స‌హిస్తామ‌ని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్ర‌భుత్వ నిధుల‌తో చేప‌ట్టే జ‌లాశాయాల‌పై ప్ర‌యివేటు ఏజెన్సీలు కాకుండా ప్ర‌భుత్వ సంస్థ‌లైన సింగ‌రేణి సంస్థ ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తికి ముందుకు రావ‌డం ప‌ట్ల ఇటు ప్ర‌జ‌ల‌కు అటూ ప్ర‌భుత్వానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్నారు. ఇందుకు సింగ‌రేణి సంస్థ‌ను ఆహ్వ‌నిస్తున్నామ‌ని చెప్పారు.

Latest Articles

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్