రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

     సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే నందిత ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయి లింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్‌, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి నట్టు తెలుస్తోంది. ఆమె పీఏ ఆకాశ్‌, డ్రైవర్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. అతి వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు ఓ వైపు పూర్తిగా దెబ్బతింది.

   గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. సాయన్న కూతురే లాస్య నందిత. సాయన్న స్థానంలో బీఆర్ఎస్‌ ఆమెకు టికెట్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలె నల్గొండ సభకు హాజరైన లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఆ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డు చనిపోయాడు. ఇవాళ తెల్లవారుజా మున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు. MLA లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం, పదిరోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమా దానికి గురికావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న డివైడర్ ను ఢీకొట్టడంతో చనిపోవడం.. ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తి పేరు ఆకాశ్‌గా తెలుస్తోంది. సదాశివపేటలో ఓ పార్టీకి హాజరై.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్‌లోనే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆకాశ్‌ను మదీనగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యుల్ని ఓదా ర్చారు. లాస్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్‌ఎస్‌ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాదికే.. ప్రజాప్రతినిధు లైన ఈ తండ్రీకూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

రానున్న 2 గంటల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. మేడ్చల్‌, రంగారెడ్డి, నల్గొండ, గద్వాల.. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు కూడా వర్ష...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్