రెండు రోజుల పాటు అబుదాబిలో మోదీ పర్యటన

      భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించ నున్నారు. యూఏఈలోని అబుదాబిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని రేపు ఆయన ప్రారంభించనున్నారు. అంతకుముందు ఇవాళ అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి అహ్లాన్ మోడీ అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపే అవకాశం ఉంది.

       ఈ ద్వైపాక్షిక భేటీలో ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఓడరేవుల రంగాలలో సహకారంపై ఒప్పందం కుదుర్చుకునే ఛాన్స్ ఉంది. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు అహ్లాన్‌ మోడీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యూఏ ఈ టూర్ తరువాత ఖతార్ కు రేపు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్తారు. దోహాలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. నావి మాజీ అధికారులను విడుదల చేసినందుకు ప్రధాని మోడీ ఖతార్‌ కు కృతజ్ఞతలు తెలిపనున్నారు.అయితే, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, పూర్తి గ్రౌండ్ రిహార్సల్‌కు రెండున్నర వేల మందికి పైగా హాజరుకానున్నారు. రేపు అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించను న్నారు. ఈ BAPS ఆలయం 27 ఎకరాల్లో నిర్మించారు.. ప్రధాని మోడీ పర్యటనకు ముందు స్వామినారాయణ ఆలయ వీడియోను రిలీజ్ చేశారు. 108 అడుగుల ఎత్తైన ఈ ఆలయం హిందూ సంస్కృతిని ప్రతిబిం బించేలా ఉంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్