నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

         ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ కు ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక ఏడాదికి ప్రభుత్వం రూ.2.86 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ గడువు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండడం, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఈ నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం రూ.96 వేల కోట్ల దాకా బడ్జెట్ ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. బడ్జెట్ కు లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. శాసన సభలో, అటు మండలిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్ధిక మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లమంటూ చెప్పారు. YSRCP ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశామని బుగ్గన తెలిపారు. ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే తమ ప్రాధాన్యత అని బుగ్గన పేర్కొన్నారు. గత ఐదేళ్ల బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసినట్లు బుగ్గన వెల్లడించారు. ఈసారి కూడా ఇవే ప్రాధాన్యతలు ఉంటాయని ఆయన సంకేతం ఇచ్చారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్