జాంబియాలో కలరా కల్లోలం… 600 మంది మృతి

       ఆఫ్రికా దేశం జాంబియాను కలరా వ్యాధి కలవరపెడుతోంది. వేల మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్‌ నుంచి 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆ దేశంలోని మొత్తం పది ప్రావిన్సుల్లో తొమ్మిదింటిలో ఈ వ్యాధి వ్యాపించ డం అక్కడి దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. స్టేడియాల వద్ద ప్రభుత్వం తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మాస్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. ప్రభావిత ప్రాంతాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తోంది. పరిస్థితు లు దిగజారడంతో విశ్రాంత వైద్య సిబ్బంది సేవలను కూడా తీసుకుంటోంది. ఈ సమయంలో పడుతున్న భారీ వర్షా లు.. వైద్య సేవలకు, సురక్షిత నీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నాయి. మామూలుగా కలరాతో మరణాల రేటు ఒకశాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ జాంబియాలో ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ రేటు నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశానికి క్లోరిన్‌ మాత్రలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలతో కూడిన 3.5 టన్నుల మానవతా సాయాన్ని పంపించిందని అధికారులు తెలిపారు.

Latest Articles

నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్