అల్లు అరవింద్-బోయపాటి కాంబినేషన్‌లో సినిమా

కొన్ని కాంబినేష‌న్స్ గురించి విన‌గానే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం ఖాయం అనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేష‌నే.. క‌మర్షియ‌ల్ మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను, అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్‌ల‌ది. 2016లో ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ ప్రాజెక్ట్ స‌రైనోడు చిత్రం ఎలాంటి అఖండ విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. అల్లు అర్జున్‌-బోయపాటి క‌ల‌యిక‌లో రూపొందిన స‌రైనోడు మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచి అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే తాజాగా ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ల‌యిక‌లో మ‌రో భారీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. భ‌ద్ర తుల‌సి, సింహా, లెజెండ్‌, స‌రైనోడు, అఖండ‌, వంటి క‌మర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను త‌న అద్బుత‌మైన మాస్‌మేకింగ్ స్కిల్స్ తో సినిమాలు తెర‌కెక్కించి మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే బోయ‌పాటి శ్రీ‌ను, వైవిధ్య‌మైన వాణిజ్య క‌థాంశాల‌ను అత్యున్న‌త‌మైన నిర్మాణ విలువ‌ల‌తో నిర్మించి ఎన్నో అఖండ విజ‌యాలు సొంతం చేసుకున్న గొప్ప నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క‌ల‌యిక అన‌గానే సినీ ప్రేమికుల్లో ఎంతో ఉత్సాహం, ఉత్తేజం క‌లుగుతుంది. సో ఆ ఉత్సహానికి , ఆ ఉత్తేజానికిఅంద‌రూ రెడీ కావాల్సిందే. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

Latest Articles

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

  తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్