భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన ప్రకటన చేశారు. తన వయసు దృష్ట్యా బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిం చారు. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ నిబంధ నల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి అనుమతి లేదు. దీంతో గతేడాదే 41 ఏళ్ల దాటిన మేరీ కోమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇంకా ఆడాలని ఉందని… దురదృష్టవశాత్తు వయస్సు తన ఆటకు అడ్డంకిగా మారిందని మేరికోమ్ తెలిపారు. మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచారు మేరీకోమ్. అలాగే ఒలింపిక్‌లో కాంస్య పతకం సాధించారు. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్‌లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. అంతేకాకుండా మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా కూడా నియమితులయ్యారు.
బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మేరీకోమ్
0
726
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


