పార్లమెంట్ ఎన్నికల కోసం కమలం పార్టీ కసరత్తు

      అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాట్లను సరిదిద్దుకుని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిం చాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తులను గుర్తించడంతో పాటు, రాజకీయ పలుకుబడి, అర్థబలం, అంగబలం, అనుచర గణం ఉన్న నేతల కోసం కాషాయ దళం అన్వేషిస్తున్నట్టు తెలిసింది.

     పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలిచే అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషిస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. గెలిచే అభ్యర్థులకే టికెట్లను కేటాయించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది.. పార్టీలో పని చేసిన విధానాలను ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు రాజకీయ పలుకుబడి, అర్థ, అనుచరులబలం ఉన్న నేతల కోసం కాషాయ దళం అన్వేషిస్తుంది.

       సిట్టింగ్ లు మినహాయించి ఇతర సెగ్మెంట్ లలో పోటీకి ఎవరిని దించాలనే అంశంపై అధిష్టానం కసరత్తు చేస్తోం ది. ఇందుకు, ఒక్కో లోక్ సభ స్థానం నుంచి నలుగురి పేర్లతో కూడిన జాబితాను హైకమాండ్ కు పంపించడానికి రాష్ట్ర కమిటీ రెడీ అయ్యింది. రాజకీయ పలుకుబడితోపాటు అర్థ బలం, అంగ బలం కలిగి గెలిచే అభివృద్ధికి టికెట్ ఇవ్వా లని అధిష్టానం డిసైడ్ అయింది. అభ్యర్థుల పనితీరు, స్థానిక బలాబలాలతో పాటు సామాజిక అంశాల ఆధారంగా టికెట్ ఫైనల్ చేయాలని భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆ డేటా సేకరణలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆశావ హుల నుంచి దరఖాస్తులను బీజేపీ స్వీకరించింది. అయితే, లోక్ సభ ఎన్నికలకు ఆశావహుల నుంచి ఎలాంటి దర ఖాస్తులు స్వీకరించవద్దని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. నేతల పనితీరును ఆధారంగా చేసుకుని టికెట్ కేటాయించాలని పార్టీ భావిస్తోంది.

      తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. కాగా గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలుపొందారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీనంగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు గెలిచారు. సిట్టింగ్ స్థానాలను వదిలి మిగిలిన 12 పార్లమెంట్ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం తలమునకలై వుంది.అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని గెలిచే అవకాశం వున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తున్నామని బీజేపీ అధిష్ఠానం తెలియజేస్తోంది. కొన్ని చోట్ల తామే బీజేపీ ఎంపీ అభ్యర్థులమని కొందరునేతలు ప్రచారం చేసుకుంటున్నారు. మల్కాజ్ గిరి , చేవెళ్ల , భువనగిరి బీజేపీ నేతలు తమకే టికెట్ వస్తుందని ధీమాగా చెబుతున్నారు. అదేవిధంగా మెదక్, జహీరాబాద్, పార్లమెంటు స్థానాలకు తామే….. అభ్య ర్థులమని కొందరు తెలియజేస్తున్నారు. ఇదేకాక, పార్లమెంట్ పరిధిలో ఏకంగా ఎన్నికల ప్రచారపర్వాన్నే ప్రారంభించే స్తున్నారు. అధిష్టానం ఈ నేతల వ్యవహారంలో ఏ చర్యలు తీసుకుంటుందో, ఎవరి పేర్లను ఫైనల్ చేస్తుందో అంతా భవితే చెప్పాలి.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్