ఇరవై రెండేళ్లకు క్షమాపణ చెప్పిన తరుణ్ తేజ్ పాల్

      జర్నలిస్ట్, తెహల్కా డాట్ కామ్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్ గుర్తున్నాడా…తరుణ్ తేజ్ పాల్, సహ వ్యవస్థా పకుడు అనిరుద్ధ్ బహల్ ఓ పరువునష్టం కేసులో సైనికాధికారి రిటైర్డ్ మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లువాలియాకు బేష రతుగా క్షమాపణ చెప్పారు. దాదాపు 22 ఏళ్ల క్రితం తెహల్కా డాట్ కామ్ లో ప్రచురించిన తప్పుడు కథనానికి గానూ బేషరతుగా క్షమాపణ చెబుతూ పేపర్ ప్రకటన కూడా ఇచ్చాడు. ఇన్వెస్టి గేషన్ జర్నలిజం.. పేరుతో అప్పట్లో తెహల్కా డాట్ కామ్ ప్రచురించిన వార్తా కథనాలు సంచలనం సృష్టించాయి. 2002 లో జరిగిన రక్షణ ఒప్పందాల్లో సైనికాధికారి హోదాలో మధ్యవర్తిత్వం వహించిన తనకు అవినీతి ఆపాదిస్తూ, ప్రచురించిన కథనం పై రిటైర్డ్ మేజర్ జనరల్ అహ్లు వాలియా ఈ పరువునష్టం దావా వేశారు. 

     ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేరుతో ఈ అవినీతి కుంభకోణం వెనుక డజన్ మందికి పైగా అధికారులు, రాజకీయవేత్తలకూ సంబంధం ఉందని టెహల్కా కథనంలో పేర్కొన్నారు. మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లువాలియా దాదాపు 50 వేల రూపా యలు మాథ్యూ సామ్యేల్ అనే రిపోర్టర్ నుంచి అందుకున్నారని, దివంగత లెఫ్టినెంట్ కల్నల్ సైల్ సమక్షంలో ఇది జరిగిందని అప్పట్లో ఆ కథనం లో పేర్కొన్నారు. మేజర్ జనరల్ బ్లూ లేబుల్ విస్కీ, పది లక్షల రూపాయలి డిమాండ్ చేశారని కూడా కథనాలు రాశారు. ఈ కథనాలపై కోర్టులు తరుణ్ తేజ్ పాల్ ను తీవ్రంగా మందలించాయి. ఢిల్లీ హైకోర్టు గడ్డి పెట్టడంతో మేజర్ జనరల్ అహ్లువాలియా ఎలాంటి లంచం తీసుకోలేదని, బ్లూ లేబుల్ విస్కీ కూడా తీసుకోలేదని తాము స్పష్టం చేశారు. తమ టేప్ లలో దొర్లిన తప్పులకు, కథనాలలో తప్పులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని
తరుణ్ తేజ్ పాల్, అనిరుద్ధ బహెల్ ప్రకటనలో పేర్కొన్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్