తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే స్వామివారి దర్శనం.. టీటీడీ నోటిఫికేషన్‌..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో ఏకాదశి రోజు నుంచి వరుసగా 10 రోజుల పాటు స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తిరుపతిలో రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఏకాదశి నాడు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో, వివిధ దేశాలలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక సూచనలు చేసింది.

దీని ప్రకారం వివిధ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రిజర్వేషన్ టిక్కెట్లను ఇప్పటికే విడుదల చేశారు.

ప్రత్యేక దర్శనం కోసం టిక్కెట్లతో వచ్చే భక్తులు కరోనా వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని టీటీడీ సూచిస్తోంది.

టీకాలు వేసినట్లు రుజువు లేని వారు ఆలయానికి వచ్చిన 48 గంటల్లోగా కరోనా ఫ్రీ సర్టిఫికెట్ తీసుకురావాలి.

ధ్రువపత్రాలు లేకుండా వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించబోమని తిరుమల దేవస్థానం బోర్డు ప్రకటించింది.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది టీటీడీ.

జనవరి 2న శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి..

భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.

పదిరోజులకు సంభందించి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు కూడా జారీ చేయనుంది టీటీడీ.

జనవరి 2 నుంచి 11 వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతోంది.

వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు సామాన భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని..రద్దీ కూడా పెరిగే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంది…..

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్