26.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

సంక్రాంతికి ఫ్రీ బస్సులపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్

           తెలంగాణలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండురోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కలిపించింది. . ఫ్రీ పథకం పెట్టినప్పటి నుండి మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. కాగా సంక్రాంతి పండగకు ఫ్రీ బస్సు సౌకర్యం లేదనే వదంతులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి పర్వానికి పుట్టింటికి వెళ్లే మహిళలకు ఉచిత బసు ప్రయా ణం పథకం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. అయితే ఇది తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు సైతం నడుపుతామని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

      టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపారు. అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లే స్వాముల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను ఈ నెల జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. హైదరాబాద్‌ నుంచి శబరిమలకు వెళ్లే ప్రతి ప్రయాణికుడికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు తెలిపారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్