28.6 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

గంజాయితో ప్రియుడిపై కోపాన్ని తీర్చుకున్న యువతి

తనను దూరం పెడుతున్నాడని ఆ యువతి ప్రియుడిపై కోపం పెంచుకుంది. తనను కాదన్న వాడిని వేధించాలని పన్నాగం పన్నింది. ప్రియుడి కారులో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించింది. పోలీసుల విచారణలో ఆ యువతి నిర్వాకం బయటపడింది. ఆమె ఓ పోలీసు అధికారి కూతురు కావడం గమనార్హం.

హైదరాబాద్ కు చెందిన శ్రవణ్, రింకీ ప్రేమించుకుని విడిపోయారు. రింకీ పోలీసు అధికారి కూతురు.. అంతేకాదు ఆమె ఓ లా స్టూడెంట్‌ కూడా. తనను దూరం పెడుతున్న ప్రియుడు శ్రవణ్‌పై పగ పెంచుకుంది. ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని పక్కా పథకం పన్నింది.

రింకీ 4 వేల రూపాయలతో గంజాయిని కొనుగోలు చేసింది. తర్వాత తన స్నేహితుల ద్వారా శ్రవణ్‌ను పిలిపించుకుని
అంతా కలిసి జూబ్లీహిల్స్ పబ్‌కు వెళ్లారు. శ్రవణ్‌కు తెలియకుండా కారులో గంజాయి పెట్టింది. శ్రవణ్ గంజాయి అమ్ముతున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులకు రింకీ ఫోన్ చేసి చెప్పింది.

పోలీసులు విచారించి రింకీతోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్