విభిన్నమైన ఆలోచనతో స్టార్ మా ‘సూపర్ సింగర్’

సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన “సూపర్ సింగర్” ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి,.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులకు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా నుంచి, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత.

మాటల సెలయేరు, హావభావాల పూలతేరు శ్రీముఖి ఈ షోని ప్రెజెంట్ చేస్తున్నారు. నలుగురు విభిన్నమైన ప్రతిభ గల న్యాయమూర్తులు ఈసారి కంటెస్టెంట్స్‌ని తీర్చిదిద్దడమే కాదు.. వారి పాటల పాటవాన్ని నిర్ణయించబోతున్నారు. పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. కమ్మని బాణీకి తన తియ్యని స్వరాన్ని చేర్చి పాటని అందమైన అనుభవంగా తీర్చిదిద్దే గాయని శ్వేతా మోహన్, జానపదాన్ని, సినిమా గీతాన్ని సమంగా తన విలక్షణమైన గొంతుతో పలికించి గుండెల్ని ఊయలలూగిస్తున్న మంగ్లీ, అకాడమీ అవార్డుల వేదిక పైన తన బలమైన వినూత్న స్వరాన్ని వినిపించిన యువ స్వరం రాహుల్ సిప్లిగంజ్, అందమైన సాహిత్య స్పర్శతో సందర్భానికి సముచితమైన, ఘనమైన స్థానాన్ని ఇచ్చే గేయ రచయిత అనంత శ్రీరామ్ – ఈ సారి న్యాయ నిర్ణేతలు. 20 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు “సూపర్ సింగర్” సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకులనూ అలరించబోతోంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షోని ఇంకా ఆసక్తికరంగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టార్ మాలో సూపర్ సింగర్ చూడాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్