‘పర్‌ఫ్యూమ్’ టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన భీమ్స్

స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ‘పర్‌ఫ్యూమ్’ అనే చిత్రం రాబోతోంది. ఇంత వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎక్కడా సినిమా రాలేదు. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి.స్వామి దర్శకత్వంలో రూపొందగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ “పర్‌ఫ్యూమ్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే మాస్ బీట్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ పర్‌ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేశారు. సురేష్ గంగుల సాహిత్యాన్ని రచించారు. వరం, కీర్తన శర్మ ఆలపించారు. ఈ పాటను భీమ్స్, భోళే షావలీ కలిసి రిలీజ్ చేశారు. ఈ పాట ఫుల్ క్రేజీగా కనిపిస్తోంది. శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా అనిపిస్తోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఈ స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ మీద అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అసలు దీని కథ ఏంటి? అన్నది నవంబర్ 24న అందరికీ తెలియనుంది. భారీ ఎత్తున ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్