స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలకు ఇంకో 27 రోజులు మాత్రమే సమయం ఉన్నందున పార్టీలు అన్నీ ప్రచార కార్యక్రమాలలో బిజీ గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో BRS ను ఓడించాలన్న కసి కాంగ్రెస్ మరియు బీజేపీ లలో బలంగా నాటుకుపోయి ఉంది. కాగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈటల మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలోని BRS ప్రభుత్వం ఏ విధంగా పేదలను అన్యాయం చేసిందో తెలిసిందే, పేదల భూములను తీసుకుని ప్రయివేట్ కంపెనీలకు అప్పనంగా ఇచ్చిందంటూ విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే అలాంటి పేదల భూములను అన్నిటినీ తిరిగి వెనక్కి ఇప్పిస్తామన్నారు ఈటల రాజేందర్. అధికారంలోకి రావడానికి BRS ఏమేమో మాయమాటలు చెబుతోంది, వారిని నమ్మి మీరు మరోసారి మోడిపోకండి అంటూ ఈటల ప్రజలను ఉద్దేశించి ఉపదేశం చేశారు ఈటల. కేసీఆర్ ఏమిచ్చినా తీసుకోండి కానీ మీ అమూల్యమైన ఓటును మాత్రమే ధర్మానికి వేయండి అంటూ ఈటల చెప్పారు.
BRS ఏమిచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం ధర్మానికి వేయండి- ఈటల రాజేందర్
0
576
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


