BRS ఏమిచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం ధర్మానికి వేయండి- ఈటల రాజేందర్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలకు ఇంకో 27 రోజులు మాత్రమే సమయం ఉన్నందున పార్టీలు అన్నీ ప్రచార కార్యక్రమాలలో బిజీ గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో BRS ను ఓడించాలన్న కసి కాంగ్రెస్ మరియు బీజేపీ లలో బలంగా నాటుకుపోయి ఉంది. కాగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈటల మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలోని BRS ప్రభుత్వం ఏ విధంగా పేదలను అన్యాయం చేసిందో తెలిసిందే, పేదల భూములను తీసుకుని ప్రయివేట్ కంపెనీలకు అప్పనంగా ఇచ్చిందంటూ విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే అలాంటి పేదల భూములను అన్నిటినీ తిరిగి వెనక్కి ఇప్పిస్తామన్నారు ఈటల రాజేందర్. అధికారంలోకి రావడానికి BRS ఏమేమో మాయమాటలు చెబుతోంది, వారిని నమ్మి మీరు మరోసారి మోడిపోకండి అంటూ ఈటల ప్రజలను ఉద్దేశించి ఉపదేశం చేశారు ఈటల. కేసీఆర్ ఏమిచ్చినా తీసుకోండి కానీ మీ అమూల్యమైన ఓటును మాత్రమే ధర్మానికి వేయండి అంటూ ఈటల చెప్పారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్