స్వతంత్ర వెబ్ డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ తొలి జాబితాలోనే టికెట్ ఖరారైన సంగతి తెలిసిందే. ఆయనపై ఉన్న నిషేధాన్ని చివరి క్షణంలో ఎత్తేసిన బీజేపీ హైకమాండ్ మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని రాజాసింగ్ ముమ్మరం చేశారు. ఈరోజు గోషామహల్ లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ సోదరులపై ఆయన విమర్శలు గుప్పించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం ఎందుకు తన అభ్యర్థిని నిలబెట్టలేదని ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. నీవు పోటీ చేయకపోతే నీ తమ్ముడు అక్బరుద్దీన్ ను నిలబెట్టు అని ఛాలెంజ్ చేశారు.
rajasiRaja Singh: ఒవైసీ సోదరులకు రాజాసింగ్ సవాల్
0
391
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


