స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపిస్తానని సవాల్ చేశారు మంత్రి మల్లారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అంటే చరిత్ర.. కేసీఆర్ సీఎం అయ్యాకే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ కొత్తగా 10 పథకాలు తీసుకువచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ.. భూకబ్జా దారులు.. వాళ్లను జైలుకి పంపించే బాధ్యత నాదే.. దళితులకు భూములను పంచే బాధ్యత నాదేనని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. రాహుల్ గాంధీ ఒక పప్పు.. ఆయనకు ఫేస్ వాల్యూ లేదు..కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలి.? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మొత్తం స్కాంలే.. రాహుల్ గాంధీకి తెలంగాణలో ప్రచారం చేసే అర్హత లేదు..కాంగ్రెస్ ఏం చేసిన అధికారంలోకి రాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఎవరేం చేశారు అనేది తెలుసు అని.. బీజేపీ వాళ్లు గతంలో కూడా పోటీ చేశారు.. ఓడిపోయారని పేర్కొన్నారు. ఈటల హుజురాబాద్ లో ఓడిపోతున్నాడు.. అందుకే కెసిఆర్ పైన పోటీ అంటున్నాడని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపిస్తా -మంత్రి మల్లారెడ్డి
0
245
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


