ఏసీబీ కోర్టు కీలక తీర్పు.. చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తూ… మరోసారి రిమాండ్ పొడిగించారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు రిమాండ్ పై విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. ఏసీబీ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసిన ప్రకారం చంద్రబాబు రిమాండ్ను నవంబర్ ఒకటవ తేదీ వరకు పొడిగించింది. దీంతో నవంబర్ ఒకటవ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడు ఖైదీ జీవితాన్ని అనుభవించనున్నారు. అయితే సెక్యూరిటీ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు కోర్టుకు తెలిపారు. దీనిపై లేఖ ద్వారా తమకు తెలియజేయాలని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

Latest Articles

సాయికృష్ణ కేసులో హైకోర్టులో విచారణపై సుప్రీంకోర్టు స్టే

విజయవాడలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్‌ సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. సాయికృష్ణ మృతి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సెప్టెంబర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్