స్వతంత్ర వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా విమర్శించారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది
Akula Lalitha: బీఆర్ఎస్ కు షాక్.. పార్టీని వీడిన మరో కీలక నేత
0
440
Latest Articles
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలకు దిగజారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు...
- Advertisement -
- Advertisement -


