34.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..!

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని  చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈనెల 10న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈనెల 13కి విచారణను వాయిదా వేసింది. తాజాగా విచారణ చేపట్టి మరోసారి ఈనెల 17కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

సీఐడీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 17 A  పుట్టక ముందే నేరం జరిగింది కాబట్టి స్కిల్ స్కామ్ కేసు చట్టసవరణ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. 2018 జులైలో చట్టసవరణ జరిగింది. 2014, 15 కేసులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణించలేము కదా? 17 ఏ అనేది అవినీతికి రక్షణ కాకూడదు. అవినీతి పరులను రక్షించేందుకు 17 ఏ చట్టసవరణ పరికరం కాకూడదు. సెక్షన్ 19 మాదిరిగా 17 ఏ సంపూర్ణంగా కేసు నమోదు కు నిరోధం కల్పించలేదని తెలిపారు ముకుల్ రోహత్గీ.

Latest Articles

గవర్నర్‌ నుంచి విజయ్‌కు ఆహ్వానం.. టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు రాష్ట్ర గవర్నర్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. లోక్‌భవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఈరోజు సాయంత్రం 4...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్