నారా లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఐడీ విచారణకు హాజరయ్యారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో భాగంగా తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న నారా లోకేష్..సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు? మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా? హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? అంటూ ప్రశ్నించింది సీఐడీ.

హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది? 2014జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా? లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి? మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారు? అని నారా లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. A 1 ముద్దాయి చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా? పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా లోకేష్ ను ప్రశ్నిస్తున్నారు సీఐడీ అధికారులు.

Latest Articles

బేగంపేట్ రైల్వేస్టేషన్‌లోకి వర్షం నీరు

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి బేగంపేట్‌ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్